చనిపోయిందనుకున్న మహిళ లేచి కూర్చుంది
గోదావరి నదిలో ఓ వృద్ధురాలు ఉలుకుపలుకూ లేకుండా కనిపించడంతో చనిపోయిందనుకున్నారు. మృతదేహాన్ని తరలించాలన్న ఉద్దేశ్యంతో పూర్తి సరంజామాతో వచ్చిన మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.
- అవాక్కయిన ధర్మాబాద్ పోలీసులు
రెంజల్, జూలై 19: గోదావరి నదిలో ఓ వృద్ధురాలు ఉలుకుపలుకూ లేకుండా కనిపించడంతో చనిపోయిందనుకున్నారు. మృతదేహాన్ని తరలించాలన్న ఉద్దేశ్యంతో పూర్తి సరంజామాతో వచ్చిన మహారాష్ట్ర ధర్మాబాద్ పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. వృద్ధురాలిని తరలించేందుకు యత్నించగా, ఆమె ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో బిత్తరపోవడం పోలీసుల వంతైంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి శివారులోని గోదావరి నది సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గోదావరి నదిలో స్నానం చేసేందుకు భక్తులు శుక్రవారం కందకుర్తి ఘాట్‌కు వెళ్లారు. అయితే, మహారాష్ట్ర వైపు ఓ మహిళ నీటిలో తేలియాడుతుండడాన్ని గమనించిన భక్తులు 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు. దీంతో రెంజల్ ఎస్సై సాయన్న అక్కడికి చేరుకుని పరిశీలించగా, మహిళ ఉన్న ప్రదేశం మహారాష్ట్ర పరిధిలోకి వస్తుందని గుర్తించి, ధర్మాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో అక్కడి పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు ఆటో, గజ ఈతగాళ్లతో గోదావరి వద్దకు చేరుకున్నారు. జాలర్లు, కానిస్టేబుల్ సదరు మహిళ చేయి పట్టుకోగా, ఆమె ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో వారు అవాక్కయ్యారు. వృద్ధురాలిని బయటికి తీసుకొచ్చి విచారించగా, ధర్మాబాద్ తాలుకా యాతాలం గ్రామ వాసిగా గుర్తించారు. కొడుకు, కోడలితో గొడవ పడి ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చినట్లుగా గ్రహించిన ధర్మాబాద్ పోలీసులు.. కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలిని అప్పగించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

