డిచ్పల్లి, నవంబర్ 22: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్, హైదరాబాద్, ఐపీఎస్ కమలాసన్‌రెడ్డి తనిఖీ చేశారు. మొదటగా గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం డిచ్పల్లి సర్కిల్ కార్యాలయాన్ని పరిశీలించి, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రిసెప్షన్ సెంటర్ సిబ్బంది, ఫిర్యాదుదారులతో ఏ విధంగా మాట్లాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రైటర్ రికార్డులు, వారి పనితీరు, 5ఎస్ విధానం పనితీరు, స్టోర్ రూమ్, రెస్ట్రూమ్, సిబ్బంది గదులను పరిశీలించారు. కోర్టు డ్యూటీ రికార్డులు, హెచ్ఆర్ఎంఎస్ విధానం అమలు జరుగుతుందో లేదో తెలుసుకున్నారు. సీసీటీఎన్ఎస్ పనిచేస్తున్న విధానం, రికార్డులు, పోలీస్ స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు, వారి సాదకబాధలను అడిగి తెలుసుకున్నారు. చక్కగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఆయన వెంట నిజామాబాద్ సీపీ నాగరాజు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్‌బాబు, నిజామాబాద్ ఏసీపీ ఎ.వెంకటేశ్వర్రావు, డిచ్పల్లి సీఐ డి.మోహన్, ఎస్సై కె.గణేశ్, బి.మనోజ్‌కుమార్, జక్రాన్‌పల్లి ఎస్సై శ్రీకాంత్, ఇందల్వాయి ఎస్సై నరేశ్, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, సీసీఆర్బీ ఎస్సై చాందయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.