కామారెడ్డి/ఖలీల్‌వాడి/బిచ్కుంద సెప్టెంబర్ 2 : బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే అన్నారు. మంగళవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా కవి త పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందుకే సస్పెం డ్ చేశారని గంప గోవర్ధన్ తెలిపారు. పార్టీలో ఎంత పెద్ద వారైనా క్రమశిక్షణకు లో బడి పని చేయాల్సిందే అని పేర్కొన్నారు. తప్పు చేస్తే కూతురు అయినా, కొడుకు అయినా సహించేది లేదని గతంలో కేసీఆర్ స్పష్టం చేశారని గుర్తుచేశారు.
ఎమ్మెల్సీ కవిత ఇతర పార్టీలకు అనుకూలంగా మాట్లాడడం విడ్డూరమని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్కు నష్టపరిచేలా మాట్లాడం పార్టీ శ్రేణుల మనోభావాలను దెబ్బతీయడమేనని, అందుకే సస్పెండ్ చేశారని తెలిపారు. పార్టీ బాగు కోసం ఎంతటివారైనా సరే చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ వెనుకాడబోరని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావు బీఆర్ఎస్ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి పట్టిన శని అని ఘాటుగా విమర్శించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావుపై ఎమ్మెల్సీ కవిత అనుచిత వ్యాఖ్యలు చేశారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తెలిపారు. ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొ న్నారు. పార్టీ నాయకత్వాన్ని కించపరిచేలా ఎవరు వ్యాఖ్యలు చేసిన అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.