కంఠేశ్వర్/ కామారెడ్డి, డిసెంబర్ 2 : జీవో నంబర్ 81, 85 ప్రకారం 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయాలని వీఆర్ఏలు, వారి కుమారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం ఉద్యోగాలు అందజేసి వీఆర్ఏల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లకు వినతిపత్రాలను అందజేశారు. నిజామాబాద్లో నిర్వహించిన నిరసనలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ దేవయ్య, అశోక్, పండరి, రాజేందర్, హన్మాండ్లు, వేణు, ఉదయ్, శివ, శంకర్, భూమయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.