బాన్సువాడ రూరల్, మార్చి 23: ఉపాధి కూలీకి చెందిన డబ్బులు సొంతానికి వాడుకున్నాడని ఫీల్డ్ అసిస్టెంట్ బసవయ్యను గ్రామస్తులు ఆదివారం నిలదీశారు. బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలోని ఉపాధి కూలీ అనిల్‌కు చెందిన పోస్టాఫీస్ ఖాతా నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ నాలుగువేల రూపాయలు డ్రాచేసుకున్నాడు.
అనిల్ అనే కూలీ ఎమర్జెన్సీ దవాఖానలో ఉన్నాడని బ్రాంచ్‌పోస్ట్ మాస్టర్‌ను నమ్మించి డబ్బులు డ్రా చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవోకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్‌ను వివరణ కోరగా.. అనిల్‌కు చెందిన ఖాతా నుంచి బయోమెట్రిక్ ద్వారా డబ్బులు తీసుకోలేదని, బీపీఎం తనకు డబ్బులు ఇస్తే అనిల్‌కు ఇచ్చినట్లు తెలిపారు.