Nizamabad | పోతంగల్ నవంబర్ 15: కారోబార్ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ఆయనను విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోతంగల్ మండలంలోని హాంగర్గ గ్రామపంచాయతీలో ఎంపీడీవో చందర్ సమక్షంలో గ్రామస్తులు సమాంవేశం నిర్వహించారు. గ్రామస్తులు కారోబార్ హమ్మండ్లు ను విధుల్లో నుండి తొలగించాలని ఎంపీడీవో చందర్ కు విన్నవించారు.
ఎంపీడీవో చందర్ మాట్లాడుతూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్తానని సమాధానమిచ్చారు. అక్కడికి చేరుకున్న మల్టీపర్పస్ నాయకులు జంగం గంగాధర్ అర్జున్, రాజేశ్వరీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శికి, కారోబార్ మధ్య సమన్వయ లోపం ఉందని పేర్కొన్నారు.
అలాగే కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న కారోబార్ని తొలగించడం సమంజసం కాదని తెలిపారు. ఈ విషయంపై ఆలోచించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగారం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.