వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వైభవంగా నిర్వహించారు. శైవ, వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్-2లో ఉన్న ఉత్తర తిరుపతి క్షేత్రం, నీలకంఠేశ్వరాలయం, జెండాబాలాజీ మందిరం,
సుభాష్‌నగర్ రామాలయం, బ్రహ్మపురి చక్రంగుడి, బడారాంమందిరం, ఖిల్లా రఘునాథాలయంతోపాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.