Pothangal | పోతంగల్, జనవరి 11 : వడ్డే ఓబన్న సేవలు చిరస్మరణీయమని నాయకుడు వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు హన్మంతు అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో గల ప్రధాన కూడలి వద్ద వడ్డే ఓబన్న జయంతి వేడుకలను వడ్డెర సంఘ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా హన్మంతు ధనరాజ్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనలో వడ్డే ఓబన్న కీలకపాత్రవహించారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నభి, స్థానిక నాయకులు భజరంగ్ హన్మండ్లు, గంట్ల విఠల్, కేశ వీరేశం, గంధపు రాజు, దత్తు, ఒమన్న పటేల్, జుమ్మాఖాన్, మోహన్, సంఘ సబ్యులు నాగయ్య, చిన్న సాయిలు, సాంబయ్య, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.