కంఠేశ్వర్, ఏప్రిల్ 27 : నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో శనివారం రాత్రి అకాల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
తడిసిన ధాన్యాన్ని ఆదివారం ఉదయం రైతులు ఆరబెట్టుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కాకుండా, త్వరగా జరిగేలా చూడాలని అధికారులకు రైతులు విన్నవించారు.