ఇందిరమ్మ ఇసుక పక్కదారి!
పొతంగల్ మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చేరాల్సిన ఇసుకను పక్కదారి పట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. అధికారుల కండ్లు కప్పి ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
- లబ్ధిదారులు బుక్ చేసుకున్నా అందని వైనం
- వే బిల్లులు తీసుకొని మధ్యలోనే మాయమవుతున్న ట్రాక్టర్లు
- అందినకాడికి దోచుకుంటున్న అక్రమార్కులు
- పొతంగల్ మండలంలో ఆగని ఇసుక దోపిడీ
వర్ని, జూన్ 12: పొతంగల్ మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చేరాల్సిన ఇసుకను పక్కదారి పట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. అధికారుల కండ్లు కప్పి ఇసుక దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. దీంతో ఇసుక అందక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పొతంగల్ ఇసుక క్వారీల నుంచి వర్ని, రుద్రూర్ మండలాల్లోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, సొంతంగా ఇండ్లు కట్టుకునే వారు ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుంటున్నారు. దీంతో అధికారులు లబ్ధిదారులు బుక్ చేసుకున్న ఇసుకను పంపించేందుకు వేబిల్లులను ట్రాక్టర్ డ్రైవర్లకు ఇచ్చి పంపిస్తున్నారు. పంపించిన ఇసుక ట్రాక్టర్లలో సగానికి పైగా మధ్యలోనే మాయమవుతుండడం గమనార్హం. లబ్ధిదారులు చెప్పిన ఓటీపీ ద్వారా ఒకటి రెండు ఇసుక ట్రాక్టర్లు మాత్రమే వారికి చేరుతున్నారు. దీంతో మిగతా ఇసుక ట్రాక్టర్లు ఎప్పుడొస్తయోనని లబ్ధిదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. తమకు రావాల్సిన ఇసుక దోపిడీకి గురవుతున్నది, అక్రమార్కులు మాయం చేశారని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో ఉంటున్నారు.
వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు మాయం!
లబ్ధిదారులు బుక్ చేసుకున్న ఇసుకను కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు బయట అక్రమంగా అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లను లబ్ధిదారులకు చేరకుండా మా యం చేస్తున్నారు. తాము బుక్ చేసుకున్న ఇసుక తమకు చేరేలా చూడాలని లబ్ధిదారులు అధికారులను కోరుతున్నారు.
ఇసుకను పక్కదారి పట్టిస్తే అనుమతులు రద్దు
ఇసుక పక్కదారి పడుతున్న విషయం నా దృష్టికి ఇంకా రాలేదు. లబ్ధిదారులు బుక్ చేసుకున్న ఇసుకకు వే బిల్లు తీసుకుని వేరే వారికి అమ్ముకునే ఇసుక ట్రాక్టర్లకు అనుమతులు రద్దు చేస్తాం. ఇసుకను పక్కదారి పట్టిస్తే ట్రాక్టర్ యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
-సందీప్‌కుమార్, తహసీల్దార్, పొతంగల్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

