కోటగిరి : నిజామాబాడ్ జిల్లా కోటగిరి మండల కేంద్ర లోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మ కర్త శ్రీ అయ్యప్ప సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పోల విఠల్ రావు గుప్తా ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి కీ పంచామృతం తో అభిషేకం నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా పండితులు పండుగ ప్రాముఖ్యత, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి పలు విషయాలు వివరించారు. కోటగిరి, వర్ని, రుద్రూర్, పోతంగల్ మండలాల నుండి భక్తులు తరలి వచ్చిస్వామి వారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ గంగాధర్, పోల అశ్విన్, బర్ల సత్యనారాయణ. పి సాయిలు, హన్మంతరావు, అరవింద్, భు పేందర్,గంగారం, రాజు, ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.