రుద్రూర్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో శుక్రవారం బడే లక్ష్మీ, పున్న సావిత్రి ల ఇండ్లు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో (Fire Accident) పూర్తిగా కాలిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న రుద్రూర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్ని మాపాక సిబ్బంది కంటే ముందు గ్రామస్థులు, యువకులు ఇంటికి నిప్పంటుకున్న విషయం తెలుసుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాని ఆపాటికే మంటలు ఎగిసి పడడంతో ఏమీ చేయలేకపోయారు. అగ్ని ప్రమాదంలో బంగారం, వెండి, డబ్బులు, సర్వం కాలిపోయి నిరాశ్రయులుగా మిగిలారు. రెండు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతున్నారు.