Suicide | వినాయక్ నగర్, అక్టోబర్; 15 : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున రైలు కింద పడి ఒకరు మరణించినట్లుగా స్థానికుల ద్వారా సమాచారం అందినట్లు రైల్వే ఎస్సై సాయ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్-జనకంపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిర్ధారించినట్లు తెలిపారు. మృతదేహం ఆనవాళ్లు పరిశీలిస్తే మృతుడు మీరా@నారాయణ కంజి సత్పుటే(45) గా విచారణలో తేలింది చెప్పారు. సదరు మృతుడు ట్రాన్స్ జెండర్ గా నిజామాబాద్ నగరానికి చెందిన మిగతా ట్రాన్స్ జెండర్లు గుర్తించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన ట్రాన్స్ జెండర్ నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతంలో నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సదరు మృతుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన వాడుగా విచారణలో తేలింది. ఈ విషయాన్ని ఔరంగాబాద్ లో ఉండే మృతుడి సోదరి సునీతకు సమాచారం అందించినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని చూసి మృతుడు తమ తమ్ముడిగా గుర్తించారు. అయితే గత 25 సంవత్సరాల క్రితమే తమ తమ్ముడు ఇంట్లోంచి వెళ్లిపోయి ట్రాన్స్ జెండర్ గా మారినట్లు మృతుడి సోదరి ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.