ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకొనే విజయదశమి పర్వదినాన్ని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు దసరానాడే పూర్ణాహుతి, ఉత్తర పూజతో సంపూర్ణం కానున్నాయి.
దసరాను పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. విజయదశమి సందర్భంగా కొనుగోలుదారులతో మార్కెట్లు సందడిగా మారాయి.
-సుభాష్‌నగర్, అక్టోబర్ 11