భీమ్గల్, నవంబర్ 10: మండలంలోని నింబాచల క్షేత్రంపై శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. ఉత్సవంలో అర్చక కుటుంబాలు, భక్తజన బృందం నృత్యాలు చేశాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా నింబాచల క్షేత్రం గోవిందనామ స్మరణతో మార్మోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీలక్ష్మీ నర్సింహుల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.