భీమ్గల్ మండలకేంద్రంలోని లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం డోలా సేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగరంలోని నాలుగు స్తంభాల రాతి మండపంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేడు రథోత్సవం (జాతర) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
– భీమ్గల్, నవంబర్ 14