ఖలీల్వాడి/ కామారెడ్డి రూరల్, సెప్టెంబర్ 1: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు కామారెడ్డి కలెక్టర్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, నిజామాబాద్ డీఈవో దుర్గా ప్రసాద్ ఆదివారం వేర్వేరుగా ప్రకటనల్లో తెలిపారు. ఆదేశాలను అమలు చేయాలని వారు సూచించారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 1 : భారీ వర్షాల కారణంగా టీయూ పరిధిలో నేడు నిర్వహించనున్న థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను వా యిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య అరుణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.