DJ Seized | రెంజల్, సెప్టెంబర్ 3 : నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించిన మూడు డీజేలను సీజచేర్చేసినట్టు రెంజల్ ఎస్సై కే చంద్రమోహన్ బుధవారం తెలిపారు. మండలంలోని కళ్యాపూర్ గ్రామంలో మంగళ వారం రాత్రి గణేష్ నిమజ్జనంలో డీజేలు ఉపయోగించరాదని ముందస్తు హెచ్చరికలు పాటించకుండా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా ఉపయోగించిన డీజేలను సీజ్ చేసి ఆ వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. మండపాల కమిటీ సభ్యులు, డీజే నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.