నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం మూడో విడుత నీటి విడుదలను గురువారం ప్రారంభించినట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మధ్యాహ్నానికి రెండు వేల క్యూసెక్కులకు పెంచి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్, జనవరి 11: నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం మూడో విడుత నీటి విడుదలను గురువారం ప్రారంభించినట్లు ఏఈ శివకుమార్ తెలిపారు. ఉదయం వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా మధ్యాహ్నానికి రెండు వేల క్యూసెక్కులకు పెంచి ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్షా 35 వేల ఎకరాలకు మొత్తం ఆరు విడుతల్లో నీటిని విడుదల చేయనున్నామని ఇప్పటి వరకు నవంబర్, డిసెంబర్ నెలల్లో రెండు విడుతల్లో 2.99 టీఎంసీల నీటిని విడుదల చేశామని వివరించారు.
ప్రస్తుతం మూడో విడుత ప్రారంభించామని రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదలను హెచ్చుతగ్గులుగా పదిరోజులపాటు విడుదల చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం మొత్తం 1405.00 అడుగుల (17.80 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 1401.97 అడుగుల (13.64 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

