18 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు టెన్షన్ వద్దు
విద్యార్థి జీవితాన్ని కీలకమలుపు తిప్పేది పదో తరగతి వార్షిక పరీక్షలే. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు.. వార్షిక పరీక్షలు దగ్గర పండుతుండడంతో సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. మంచి మార్కులు వస్తాయో లేదోనని ఆందోళన కలుగుతుంది.
- ఆత్మ విశ్వాసంతో ఒత్తిడి దూరం
కామారెడ్డి/కోటగిరి, మార్చి 12: విద్యార్థి జీవితాన్ని కీలకమలుపు తిప్పేది పదో తరగతి వార్షిక పరీక్షలే. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు.. వార్షిక పరీక్షలు దగ్గర పండుతుండడంతో సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. మంచి మార్కులు వస్తాయో లేదోనని ఆందోళన కలుగుతుంది. ఒత్తిడిని ఆదిగమించి, ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. చదువుకునే వాతావరణం, తీసుకునే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవడంతోపాటు పిల్లల్లో భయాందోళన కలగకుండా ఆత్మ విశ్వాసం నింపడంలో తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతో కీలకం. నచ్చిన ప్రదేశాలు, ఇష్టమైన వ్యక్తుల సమక్షంలో చదువుకోవడం ఎంతో మేలు. విద్యార్థులు తమ టెన్షన్ దూరం చేసుకునేందుకు నిపుణులు చేస్తున్న సూచనలివీ..
మార్కుల కోసం పిల్లల్ని వేధించకండి..
విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకం. వారి ప్రోత్సాహం లేకుంటే పిల్లలు ఎందులోనూ రాణించలేరు. మార్కుల పేరిట ఒత్తిడి తేవడం సరికాదు. సందేహాలుంటే వెంటనే నివృత్తి చేయాలి. బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దకూడదు. పిల్లలకు చదువురాదని, మార్కులు తక్కువగా వస్తాయని, ఫెయిల్ అవుతారని, వారి స్నేహితుల కన్నా వెనుకపడ్డావంటూ నెగెటివ్ ధోరణితో కించపర్చొద్దు. ముఖ్యంగా ఫలితాలపై అతిగా అంచనాలు పెంచుకోవడం కూడా మంచిది కాదు. ర్యాంకులు వస్తాయని ఆశించి, ఆమేర చదవాలని ఒత్తిడి చేయెద్దు. తర్వాత ర్యాంకులు రాలేదని వేధిస్తే మానసిక ైస్థెర్యం కోల్పోయి ముందుకు సాగలేరు.
మానసిక సన్నద్ధత ఇలా…
- కేంద్రాన్ని ముందుగానే చూసుకుంటే చివరి నిమిషంలో హైరానా ఉండదు.
- పరీక్ష ముందురోజు హాయిగా నిద్రపోవాలి. నిద్ర మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది.
- పరీక్షలకు వెళ్లే ముందు పెన్ను, పెన్సిల్, ప్యాడ్, హాల్‌టికెట్‌ను సరి చూసుకోవాలి.
- ఎగ్జామ్ సమయానికి అరగంట ముందే కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
- కొత్త వాతావరణంలో ఉన్నామనే భయాన్ని వదిలేయాలి.
- ప్రశ్నలన్నింటినీ క్షుణ్ణంగా చదివి, బాగా రాయగలననుకున్న ఆరేడు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. చివరగా ఎంపిక చేసుకున్న ప్రశ్నలకు జవాబులు రాయడం మంచిది.
రాత బాగుంటే మంచి మార్కులు
- పరీక్షల్లో చదవడంతోపాటు రాత కూడా ముఖ్యం. చేతిరాత బాగుంటే 10 నుంచి 15 శాతం మార్కులు అదనంగా పొందవచ్చని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.
- రాసేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి..
- పెన్ను, పెన్సిల్ పట్టుకునే విధానం తగిన విధంగా ఉండాలి.
- ఎట్టి పరిస్థితుల్లో రెడ్, గ్రీన్ పెన్నులు వాడకూడదు. బ్లూ లేదా బ్లాక్ పెన్నులు వాడాలి.
- పదాలు, వాక్యాలు, పేరాల మధ్య తగిన స్థలం వదలాలి.
- అక్షరాలు సైజు స్పష్టంగా కనిపించేలా ఒకే తీరు ఉండాలి.
- గొలుసుకట్టు రాత, అక్షరం, భాషా దోషాలు ఉండకూడదు.
- వేగంగా రాయడం ప్రాక్టీస్ చేయాలి.
- ఇవి పాటించాలి..
- సమాధానం రాసేముందు ప్రశ్నల నంబర్లు సరిగ్గా వేయాలి
- సమాధాన పత్రాలు ఇవ్వగానే స్కేల్ సాయంతో తగిన మార్జిన్ పెట్టుకోవాలి.
- జవాబు పత్రంపై ఒక్కో పేజీకి 16 నుంచి 18 లైన్లకు మించకుండా చూసుకోవాలి.
- ఆన్సర్ షీట్‌పై ప్రతి వాక్యం స్ట్రెయిట్‌గా ఉండేలా రాయాలి.
- ముఖ్యమైన అంశాల కింద అండర్లైన్ ఉండేలా చూసుకోవాలి.
- కామా, ఫుల్‌స్టాప్‌లు పాటిస్తూ రాయాలి.
- తెలుగులో అక్షరాలు గుండ్రంగా, తలకట్టు, దీర్ఘాలు, ఒత్తులు స్పష్టంగా కనిపించేలా ఉండాలి.
- ఇంగ్లిష్‌లో పదాలను స్లాంట్గా, స్ట్రోక్స్ పాటిస్తూ రాయాలి.
- స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. ఓవర్ రైటింగ్ ఉండకూడదు.
- క్యాపిటల్, స్మాల్ లెటర్స్ వ్యత్యాసం గమనిస్తూ రాయాలి.
- సైన్స్, సోషల్‌లో బొమ్మలు గీయడం లేదా పటాల్లో స్థలాలను స్పష్టంగా గుర్తించాలి.
ఆరు గంటల నిద్ర అవసరం..
బాగా తినాలి.. బాగా చదవాలి.. బాగా పరీక్షలు రాయాలి. ఈ మూడు అంశాలను విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి. పరీక్షల్లో బాగా రాయాలనే ఆత్రుతతో సమయపాలన లేకుండా చదవడం మంచిది కాదు. నిద్రలేమితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పరీక్షా కేంద్రాల్లో కండ్లు మూతపడుతుంటాయి. కునుకు తీయాల్సి వస్తుంది. ఏకాగ్రత కోల్పోతుంది. చదివినవి గుర్తుకురావు. సమాధానాలు సరిగా రాయలేరు. అందుకే పరిపూర్ణంగా నిద్ర పోవాలి. విద్యార్థులు రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం తప్పనిసరి.
ఆహారం ప్రధానం..
ఏడాది పొడవునా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్లో కొందరు వార్షిక పరీక్షల సమయంలో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనుకబడిన సందర్భాలు అనేకం. పిల్లలు తమ ఆర్యోగాన్ని కాపాడుకోవడంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రోజువారీగా తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మేలు. సాత్విక ఆహారంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడంతోపాటు ఉత్సాహం చేకూరుతుంది. పండు,్ల కూరగాయలు తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. పరీక్షకు వెళ్లే సమయానికి మూడు గంటల ముందే తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి బలవర్ధకమైన ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

