నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ డాక్టర్స్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ పార్కు మురికి కూపంలా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో చుట్టు పక్కల ఇండ్ల నుంచి వచ్చే మురికినీరు ఇక్కడికే చేరుతున్నది. దీంతో దుర్గంధం వెదజల్లడంతోపాటు దోమలు వృద్ధి చెంది ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.