సుభాష్‌నగర్, నవంబర్ 5: కార్తీక మాసం అం టేనే పూజలు, వ్రతాలకు ప్రత్యేకం. కార్తీక దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మాసంలో తుల సి పూజను దైవ స్వరూపంగా భావిస్తారు. ఆదిదేవుడు పరమశివుడికి ప్రీతికరమైన కార్తీకమాసం డిసెంబర్ ఒకటి వరకు కొనసాగనున్నది. కార్తీక మాసోత్సవాల కు జిల్లాలోని శివాలయాలు, వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. నెలరోజులపాటు భక్తులు నిష్టతో ప్రాతఃకాల అభిషేకాలు, దీపారాధనలు చేస్తే అత్యంత ఫలప్రదం. నెలరోజుల పా టు శివాలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగనున్నాయి.
15న కార్తీక పౌర్ణమి
ఈనెల 15న కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని శంభులింగేశ్వరాలయం, నీలకంఠేశ్వరాలయం, ఓంకారేశ్వరాల యం, మా ర్కం డేయ మందిరం, శ్రద్దానంద్ గంజ్ ఉమామహేశ్వరాలయాలతో పాటు సుభాష్‌నగర్, బడాబజార్ రామాలయాల్లో విశేష పూజలు, సహస్రదీపాలంకరణలు, జ్వాలాతోరణం, ఆకాశదీపం కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
దీపారాధనలు, వనభోజనాలు
కార్తీక మాసంలో కార్తీక పురాణ పఠనంతో పాటు ఉదయం, సాయం త్రం దీపారాధనలు,వనభోజనాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మానవుల్లో ధార్మిక చింతన భక్తివికాసం కలిగించడానికి తులసి, ఉసిరిక వృక్షాల కింద పిండి, ఉసిరి దీపాలు వెలిగించడం, పండితులకు దీపదానాలు చేయడం తదితర పూజలతో భక్తులకు వైకుంఠ, కైలాస ప్రాప్తి, మహిళలకు అఖండ సౌభాగ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది.
ముఖ్యమైన రోజులు
కార్తీక మాసంలో శుభకార్యాలకు శివపూజలకు అనుకూలమైన మాసం. 12న బోధనైకాదశి, 13న చిలుక ద్వాదశి, తులసీలగ్నాలు, సత్యనారాయణ వ్రతాలు, 14న వైకుంఠ చతుర్దశి, చాతుర్మాస దీక్ష సమాప్తి, 15న కార్తీక పౌర్ణమి, తులసీ, ఉసిరిక లగ్నాలు, సత్యనారాయణ వ్రతాలు, 19న సంకష్ట చతుర్దశి, 26న ఏకాదశి, 29న మాసశివరాత్రి, డిసెంబర్ ఒకటిన కార్తీక బహుళ అమావాస్య, డిసెంబర్ 2 మార్గశిర మాసం ఆరంభం.
వేలాది వివాహాలు
రాబోవు రెండు నెలలు దివ్యమైన శుభముహూర్తాలు ఉన్నాయి. వేలాది వివాహాలు జరగనున్నాయి. రెండు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్లు, కూలీలకు చేతినిండా పనులు దొరకనున్నాయి.
ఫంక్షన్ హాళ్లు దొరకని పరిస్థితి
ఉమ్మడి జిల్లాలోని ఫంక్షన్ హాళ్లలో వసతులను బట్టి ఒకరోజు అద్దె రూ. 40వేల నుంచి రూ. 3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పెండ్లిల సీజన్ మొదలు కావడంతో వాటి ధరలు అమాంతం పెంచేశారు. ఫంక్షన్‌హాళ్లు లభించని వారు దేవాలయ ప్రాంగణాలు, ఇండ్ల వద్ద, ఖాళీ ప్రదేశాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శుభ ముహూర్తాలు
నవంబర్ 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17, 22, 24, 25 28, డిసెంబర్ నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 26