ఇందూరు: దుర్గామాత నవరాత్రోత్సవాలను నిబంధనలకు మేరకు ఆనందంగా జరుపుకోవాలని జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు, పూల మొక్కలు, ఇతర వస్తువులను విక్రయించే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. రాత్రి సమయాల్లో అనుమానంగా సంచరించే వారి సమాచారం పోలీసులకు అందించాలని , కాలనీల్లో గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
తాళం వేసి ఊరు వెళ్లే ముందు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. చుట్టుపక్కల ప్రజల ఫొన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమీప పోలీస్ స్టేషన్ నంబర్లను, అత్యవసర ఫొన్ నంబర్లను సైతం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.