ధర్పల్లి, మార్చి 17 : మండలకేంద్రంలోని పెద్దమ్మ ఆలయ 24వ వార్షికోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ హాజరై ఎంపీపీ నల్ల సారికతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ భక్తిభావంతో ముందుకు సాగాలని అన్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, మాజీ చైర్మన్ జీయర్ కిశోర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కొండ చంద్రశేఖర్, నాయకులు సురేందర్‌గౌడ్, సుభాష్, శ్రీనివాస్‌నాయక్, గోపాల్‌నాయక్, శంకర్‌నాయక్, ముదిరాజ్ సంఘం పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
గోవింద్ పల్లిలో బోనాల సమర్పణ
ధర్పల్లి మండలంలోని గోవింద్‌పల్లి గ్రామపరిధిలో ఉన్న పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలను ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బోనాలు తీసి గ్రామంలోని ప్రధానవీధుల గుండా ఊరేగించారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో శనివారం యజ్ఞం, ప్రత్యేకపూజలు, జాతర తదితర కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని ముదిరాజ్ సంఘ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహన్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గంగాదాస్, శ్రీకాంత్, గ్రామపెద్దలు, ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మల్లారంలోఘనంగా బోనాల ఊరేగింపు
నిజామాబాద్ రూరల్, మార్చి 17 : మండలంలోని మల్లారంలో పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పువాయిద్యాల మధ్య బోనాలను గ్రామంలో ఊరేగించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నగేశ్, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్‌రావు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాజుల శంకర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సాయినాథ్, కార్యదర్శి గాజుల గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ పిట్ల నెహ్రూ, సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.