మాక్లూర్ , ఏప్రిల్ 28 : మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్ మండలం డొంకేశ్వర్‌కు చెందిన మహమూద్ అనే ఆటో డ్రైవర్ తన భార్య యాసిన్బేగం, బంధువులు సాజిత, ఆమె కుమారుడు రిజ్వాన్‌తో కలిసి డొంకేశ్వర్ నుంచి నిజామాబాద్‌కు సొంత ఆటోలో బయల్దేరాడు.
నందిపేట్‌లో ఇద్దరు, మాదాపూర్‌లో ఇద్దరు, జ్యోతినగర్ వద్ద మరో ఇద్దరు ప్యాసింజర్లను ఎక్కించుకున్నాడు. ఆటో మాక్లూర్ వద్దకు చేరుకోగానే నిజామాబాద్ నుంచి వస్తున్న బొలేరో వాహనం అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీ కొట్టి అందులోని 10 మంది ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
డ్రైవర్ మహమూద్ కుటుంబ సభ్యులతో పాటు జ్యోతినగర్‌కు చెందిన చిటూరి మీనా, మామిండ్ల శోభ, మాదాపూర్‌కు చెందిన లక్ష్మి, మాక్లూర్‌కు చెందిన భరత్రావు, నందిపేట్‌కు చెందిన కుమ్మరి రజని, కొడుకు అంజిత్‌కుమార్ గాయాలయ్యాయి. బొలేరో డ్రైవర్ భగద్కు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లాడని ఎస్సై చెప్పారు. డ్రైవర్ భగద్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.