కామారెడ్డి/ ఖలీల్వాడి, ఫిబ్రవరి 25: ఉమ్మడి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించగా, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, జనరల్, ఒకేషనల్ 9,565 మంది విద్యార్థులు 9,228 (96.48శాతం) మంది హాజరయ్యారు.
337 మంది గైర్హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం19,150 విద్యార్థులకు 18,574 (97శాతం) మంది విద్యార్థులు హాజరుకాగా, 576 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 58 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పలు ఎగ్జామ్ సెంటర్లలో జిల్లా అధికారులు తనిఖీలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తనిఖీ చేసి, ఏర్పాట్లును పరిశీలించారు.