కంఠేశ్వర్, మే 31: నిరుద్యోగ యువత కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు టాస్క్ ప్రాంతీయ కేంద్రాల ముఖ్య అధికారి నవీన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉన్నత స్థాయి నైపుణ్యాలను పెంపొం దించుకొని మంచి ఉద్యోగావకాశాలను పొందాలని ఆయన సూచించారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రిలేషన్షిప్ మేనేజర్ శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన ఇతర నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిజామాబాద్‌లోని టాస్క్ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు రుసుము 599 రూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9154252588, 7013675052 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.