Taekwondo competitions | ఎస్జీఎఫ్ఐ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో క్యూరియస్ అథ్లెట్ల ప్రతిభ
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్టోబర్ 12 నుంచి 14 వరకు వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల తైక్వాండో పోటీలు, ఎంపికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు.
- మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం కైవసం
- జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు క్రీడాకారుల ఎంపిక
Taekwondo competitions | కంటేశ్వర్, అక్టోబర్ 25 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్టోబర్ 12 నుంచి 14 వరకు వికారాబాద్ జిల్లా పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్-17 బాలబాలికల తైక్వాండో పోటీలు, ఎంపికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఐదుగురు క్రీడాకారులు నిజామాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించారు. కాగా, మూడు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పతకంతో మొత్తం నాలుగు పతకాలు సాధించి అకాడమీకి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ పోటీల్లో హర్ష్ పాండ్రే అండర్-17 బాలుర 51 కిలోల విభాగం, అమన్ సింగ్ అండర్-17 బాలుర 59 కిలోల విభాగం, నేహా వైష్ణవి అండర్-17 బాలికల 68 కిలోల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈషా అండర్-17 బాలికలు 42 జిల్లాల విభాగంలో కాంస్య పథకం సాధించి సత్తా చాటారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 22 నుంచి 26 వరకు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న 70వ జాతీయ స్కూల్ గేమ్స్ తైక్వాండో అండర్-17 బాలబాలికల ఛాంపియన్షిప్ 2026–27లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
క్రీడాకారులను అభినందించిన జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులను జిల్లా యువజన క్రీడల అధికారి పవన్ కుమార్ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపిక కావడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి అలివేణి మంగ, ఎస్జీఎఫ్ పరిశీలకుడు ఈశ్వర్, ఛాంపియన్స్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అజ్మత్ ఖాన్, తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, క్యూరియస్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు, ప్రధాన శిక్షకుడు వినోద్ నాయక్, కోశాధికారి, అకాడమీ కోచ్ వినోద్ క్రీడాకారులను అభినందించారు. జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించి రాష్ట్ర కీర్తిని చాటాలని ఆకాంక్షించారు.
క్రీడాకారుల విజయమే లక్ష్యం: వినోద్ నాయక్
క్యూరియస్ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకుడు, ప్రధాన శిక్షకుడు వినోద్ నాయక్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందని, ఒక క్రీడాకారుడి విజయం వెనుక నిరంతర సాధన, క్రమశిక్షణ, కోచ్‌ల అంకితభావం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటాయి అని అన్నారు .మా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో పోటీపడటం మా అకాడమీకి ఎంతో గర్వకారణం అని తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

