బాన్సువాడ రూరల్ : విద్యారంగంలో విశేష కృషి చేసిన బాన్సువాడ వాస్తవ్యులు, ప్రభుత్వ డిగ్రీ,పీజి కళాశాల బోధన్ విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ యం.తుకారాం( Thuka Ram ) కొత్వాల్‌కు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డు (Swami Vivekananda Indian Icon Award) లభించింది. ఆదివారం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇండో యూరప్ బిజినెస్, ఇండస్ట్రీ, వైస్ చైర్మన్ లక్ష్మీకాంతం ఆదివారం అవార్డును హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.
విద్యారంగంలో 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎందరో విద్యార్థులను తీర్చి దిద్ది అనేక అవార్డులు అందుకొని, అనేక రచనలు చేసిన సేవలకు గుర్తింపుగా స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ జాతీయ అవార్డ్ -2025ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవితేజ, సాలార్ జంగ్ మ్యూజియం, మాజీ డైరెక్టర్ నాగేందర్ రెడ్డి, ఇండియన్ రైల్వేస్ డీఎస్పీ శ్రీనివాస్ , విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్ సీఈవో, డాక్టర్ సత్యవోలు రాంబాబు తదితరులు హాజరై అవార్డ్ గ్రహితను అభినందించారు.