Summer training camp | బీర్కూర్, మే 5: బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వేసవి శిక్షణ శిబిరాన్ని ఇన్ఛార్జి ఎంఈఓ వెంకన్న ప్రారంభించారు. ఈ శిబిరంలో అథ్లెటిక్స్, వాలీబాల్, చెస్, డిస్క్ తో తదితర క్రీడా పోటీల తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఉంటుందని తెలిపారు.
ఈ శిబిరం 15 రోజులపాటు కొనసాగుతుందని ఉదయం ఏడు గంటల నుంచి 9 గంటల వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. కావున విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీ ప్రసాద్, మాజీ ఎంపీపీ రఘు, మేకల విట్టల్ తదితరులు పాల్గొన్నారు.