MLA Sudarshan Reddy | రెంజల్, ఆగస్టు 2 : రెంజల్ మండలంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 75 వ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలను పార్టీ అధ్యక్షుడు మోబీన్ ఖాన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే సాటాపూర్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.