Honored | కోటగిరి, ఆగస్టు 1 : నిజామాబాద్ జిల్లా కోటగిరి గ్రామానికి చెందిన పీ గౌతమ్ కృష్ణ, కర్నె భిశ్వజిత్ ఇద్దరు విద్యార్థులు సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్ష లో ప్రతిభ కనబరిచినందుకు కోటగిరి జై కిసాన్, ఆదర్శ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో చావిడి పెద్ద హానుమాన్ మందిరం లో శుక్రవారం విద్యార్థులకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ చిన్న వయసులోనే బాగా చదువుకొని ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. ఇలాగే భవిష్యత్తులో కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. నవోదయ లో సీటు సాధించిన పీ గౌతమ్ కృష్ణ కు, సైనిక్ స్కూల్లో సీటు సాధించిన కర్నె భిశ్వజిత్ ఈ సందర్భంగా శాలువా పూలమాలతో విద్యార్థులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి జై కిసాన్ మున్నూరు కాపు సంఘం, ఆదర్శ మున్నూరు కాపు సంఘం నిర్వాహకులు పాల్గొన్నారు.