చందూర్ : మండల కేంద్రంలోని సాయి విద్యాలయ పాఠశాల (Sai Vidyalaya School ) ఆధ్వర్యంలో రామాయణంలోని (Ramayanam ) ఖండాలను తీసుకొని పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల విద్యార్థులు ఎలా ఉండాలో బాల్యంలో ఏం నేర్చుకోవాలో విద్యార్థులు వివరించారు. బాల్యంలో మంచి నడవడిక నేర్చుకున్నప్పుడే భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిగమించవచ్చని గుర్తు చేశారు.
విద్యార్థులు లక్ష్యాలను ఏర్పరుచుకుని చదువుల్లో రాణించాలన్నారు. కొందరు చిన్నారులు పాఠశాల పూర్తయి ఇంటికి రాగానే ఫోన్ లకే పరిమితం కావడంతో అనా రోగ్యంతో పాటు అనామకుడిగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫోన్ లో ప్రాజెక్టు సంబంధించిన విషయాలు మాత్రమే గ్రహించకుండా గేమ్స్ ఆడుతూ చెడిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ (ACP) ఎంపీడీవో నీలావతి, ఎంఈవో శ్రీనివాసరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.