బోధన్ రూరల్ : విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో (Joint Collector Vikas Mahato) అన్నారు. నిజామాబాద్ జిల్లా సాలురా మండల కేంద్రంలోని ప్రజ్ఞ శ్రీ (Pragna Sri School) పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజ్ఞ శ్రీ పాఠశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని గ్రామీణులకు విద్యనందిస్తున్న పాఠశాల యజమాన్యాన్ని అభినందించారు. గ్రామీణ ప్రాంతాలు సైతం పట్టణాలకు ధీటుగా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ శ్రీ పాఠశాల కరస్పాండెంట్ లతా రాజు, బోధన్ ఎంఈవో నాగయ్య, టీఆర్టీయూ నాయకులు ఇ. శంకర్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.