బాల్కొండ : ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కు బంగారు బాట వేయాలి ఎంఈవో బట్టు రాజేశ్వర్ ( MEO Rajeshwar ) సూచించారు. మండలంలోని చిట్టాపూర్( Chittapur ) ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పిల్లలు పాఠశాలకు ప్రతి రోజూ హాజరయ్యేలా చూడాలని , పాఠశాల అభివృద్ధి కార్యక్రమల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు.
పాఠశాల విద్యాపరంగా పురోగతి, అభ్యాస ఫలితాల సాధన, పాఠశాల సౌకర్యాల మెరుగుదల, మధ్యాహ్న భోజనం( Midday Meals ) మొదలైన వాటి గురించి చర్చించుకుని పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి , శ్రీనివాస్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుబీర్ శ్రీనివాస్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు , గ్రామ పెద్దలు, గ్రామ అభివృద్ధి కమిటీ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.