పోతంగల్ : విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని పోతంగల్ ఎంఈవో శంకర్ (MEO Shanker ) సూచించారు. బుధవారం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థికి జీవితంలో 10వ తరగతి పరీక్షలు (Tenth Exams ) అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని అన్నారు.
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం (Cash incentive)
విద్యార్థులను ప్రోత్సహించేందుకు మండల నాయకుడు ప్రకాష్ పటేల్ వారి తల్లిదండ్రులు మర్కేలి గంగారాం, ఇరవ్వా జ్ఞాపకార్థం పదో తరగతి పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థికి మొదటి బహుమతిగా రూ. 5వేలు, రెండో బహుమతిగా రూ. 3వేల నగదు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచిమార్కులు సాధించాలని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకూ పరీక్షప్యాడులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో గంగాధర్, ప్రధానోపాధ్యాయులు సాయిలు, మాజీ ఎంపీపీ గంధపు పవన్, మాజీ సర్పంచులు శంకర్, గంట్ల విఠల్, వహీద్, మాజీ ఎంపీటీసీ వీరేశం, పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి నాగ్నాథ్, రాష్ట్ర బాధ్యులు శ్రీరామ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.