బాన్సువాడ రూరల్ : తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ గురుకులంలో చదువుతున్న విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం ( Health) పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ (MPDO Bashiruddin) అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం బోర్లం గ్రామంలోని మైనార్టీ గురుకుల ( Minority Gurukul school) పాఠశాల, కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మధ్యాహ్నం విద్యార్థులకు వండిన భోజనం, కూరలను, మెనూచార్ట్ను పరిశీలించారు. స్టోర్ గదిలోకి వెళ్లి పప్పు దినుసులు కూరగాయలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్లలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధన ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు.
ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ పై ఉందని వెల్లడించారు. ఆయన వెంట ప్రిన్సిపల్ ధనలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సృజన్ రెడ్డి, సాయికుమార్, తదితరులు ఉన్నారు.