పెద్ద కొడప్గల్ : కామరెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో ఆదివారం గురుకుల 5వ తరగతి ప్రవేశానికి పరీక్షలు నిర్వహించారు. పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి విద్యార్థులు చేరుకొన్నారు. గేటు వద్ద బోర్డుపై అతికించిన హాల్ టికెట్ నెంబర్లను చూసుకొని పరీక్ష కేంద్రానికి విద్యార్థులు వెళ్లారు. పరీక్ష కేంద్రాల్లో 476 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.