MRPS | కోటగిరి ఆగస్టు 1 : మాదిగ సోదరులు గ్రామ గ్రామాన లోక్ షాహీర్ అన్నా భావు సాటే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచిరాం కోటగిరి లో జరిగిన అన్నభావు సాటే జయంతిలో పిలుపునిచ్చారు. కోటగిరి మండల కేంద్రంలో అన్న భావు సాటే 105 జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కోటగిరి మండల అధ్యక్షుడు హస్గుల శ్రీ కాంత్ జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా అన్నా భావు సాటే చిత్రపటానికి పూల మాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతీ ఒక్కరూ అన్నాభావు సాటే అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్నం శ్రీనివాస్, సాయిలు, విజయ్, లాలయ్య, శంకర్, యాదు, సంజు, పోశెట్టి, రాజు, సాయిలు, గంగారం తదితరులు పాల్గొన్నారు.