NIZAMABAD | పోతంగల్, ఏప్రిల్ 6 : మండలంలోని గ్రామాల్లో శ్రీ రామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో హనుమాన్ స్వాములు శోభాయాత్ర నిర్వహించారు. ఉదయం నుండే హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరామ కల్యాణం, పల్లకీ సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలోని హంగర్గ లో హనుమాన్ మాల దారులకు వంట కు వినియోగించు కోవడానికి సామజిక సేవా కర్త ఏంఎ హకీమ్ రూ.25 వేల విలువ గల వంట పాత్రలు అందజేశారు. ఇందుకు ఆయనకు హనుమాన్ మాలదారులు సన్మానించి మమొంటో అందజేశారు. హంగర్గ లో హనుమాన్ ఆలయ పునర్నిర్మాణం కోసం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరేడి గంగాధర్ రూ.51వేల రూ. చెక్కును ఈ సందర్భంగా అందజేశారు.