కన్నుల పండువగా శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణం
మండలంలోని తూంపల్లి గ్రామంలోని ఎదురుకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజలతో పాటు కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
సిరికొండ, ఫిబ్రవరి 2 : మండలంలోని తూంపల్లి గ్రామంలోని ఎదురుకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞం, హోమం, ప్రత్యేక పూజలతో పాటు కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారికి ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. స్వామివారిని ధర్పల్లి జడ్పీటీసీ, జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులుడు బాజిరెడ్డి జగన్, జడ్పీటీసీ సభ్యుడు మాన్సింగ్, నాయకులు ఆకుల తిర్మల్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు బాలమణీ మల్లేశ్, శంకర్‌లాల్, సంగ్లూ, ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, మోజీలాల్, లక్ష్మణ్ గౌడ్, పెద్ద నర్సయ్య, సాయిలు, సంతోష్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఆనందగిరి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 2 : మండలంలోని కొలిప్యాక్ గ్రామంలో ఉన్న ఆనందగిరి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం బ్రహ్మోత్సవ సంకల్పం, దీపారాధన, స్వస్తి పుణ్యాహవాచనం, సర్వదేవ ఆహ్వానం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాది మఠాధీశులైన శ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారి ఆదేశానుసారం ఈనెల 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 3న గరుడ ధ్వజారోహణం, 4న పాత్రరూపాసనం, కల్యాణ మహోత్సవం, 5న రథోత్సవం (జాతర), 6న పూర్ణాహుతి, చక్రతీర్థం, 7న డోలాసేవ, ఉత్సవసమాప్తి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బాలయ్య, ఎంపీటీసీ సభ్యుడు ఢీకొండ శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

