వినాయక నగర్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో (Enforcement Work) భాగంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి (ACP Raja Venkatreddy) ఆదేశాల మేరకు నగరంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు.
చోరీకి గురైన వాహనాలను గుర్తించడం, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడం, డాక్యుమెంట్లు లేని వాహనాలపై కేసులో నమోదు చేయడం చేపట్టారు. త్రిబుల్ రైడింగ్ వాహనాల పై సైతం కేసులు నమోదు చేశారు. వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి పర్యవేక్షణలో గాంధీచౌక్ లో వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఫోర్త్ టౌన్ పరిధిలో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన పలువురుపై కేసు నమోదు చేయడంతో పాటు డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.