ధర్పల్లి : రోజు మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తున్న తండ్రి ఆగడాలను భరించలేక ఓ తనయుడు తండ్రిని హతమార్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ధర్పల్లి ( Dharpalli ) మండలం ఒన్నాజీపేట గ్రామంలో జరిగిన ఘటన వివరాలను సీఐ భిక్షపతి ( CI Bhikshapati ) వెల్లడించారు.
ఒన్నాజీపేట్ గ్రామానికి చెందిన పాలెం మల్లయ్య(65) అనే వృద్ధుడు మద్యం సేవించి కుటుంబ సభ్యులతో తరుచూ గొడవపడేవాడని , ఈ క్రమంలోనే శనివారం రాత్రి మద్యం సేవించిన తండ్రి గొడవ పడడంతో కోపోద్రిక్తుడైన తనయుడు మధు కళ్లు సీసాతో తలపై బాదడంతో వృద్ధుడికి తీవ్రగాయాలై మృతి చెందినట్లు తెలిపారు.
దాడికి మృతుని భార్య లక్ష్మి సైతం సహకరించినట్టు వెల్లడించారు. మృతిని అన్న కుమారుడు సుమన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.