కామారెడ్డి, జూలై 26 : నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సర్వేపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే నెల 10 వరకు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నాయకులు అప్రమత్తంగా ఉంటూ అసలైన ఓటర్ల ఓటు హక్కును కాపాడాలని సూచించారు. బీఎల్వోలు ఇచ్చిన దరఖాస్తు ఫారాలను పూర్తిచేసి అందజేసే విధంగా చూడాలన్నారు.
ఆగస్టు 3వ తేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తులను బీఎల్వోలకు అంద జేయాలని సూచించారు. 10వ తేదీన జాబితాను ప్రదర్శిస్తారని తెలిపారు. జాబితాను పరిశీలించి అర్హులైన వారి పేర్లు ఉన్నాయా లేదా అని చూడాలని సూచించారు. సమావేశంలో కౌన్సిలర్లు అరికల ప్రభాకర్ యాదవ్, హఫీజ్, లోలం శ్రీనివాస్, నాయకులు కాసర్ల స్వామి, ప్రభాకర్ రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.