పోలీసుశాఖలో కలకలం
కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో బుధవారం రాత్రి కలకలం రేగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి అదృశ్యం కావడం, వారి సెల్ఫోన్లు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కట్టపై లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ మేరకు చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
- ఎస్సై, మహిళా కానిస్టేబుల్ అదృశ్యం
- అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కట్టపై కారు, ఫోన్లు లభ్యం
- చెరువులో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
- భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శ్రుతితోపాటు మరో వ్యక్తి మిస్సింగ్
- శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యం..
- ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్పీ సింధూశర్మ
రామారెడ్డి, డిసెంబర్ 25 : కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో బుధవారం రాత్రి కలకలం రేగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి అదృశ్యం కావడం, వారి సెల్ఫోన్లు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కట్టపై లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ మేరకు చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ కోసం గాలిస్తున్నారు. వారి ఫోన్లు స్విచాఫ్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లారు. చెరువు కట్టపై ఎస్సై సొంత కారుతో పాటు మూడు ఫోన్లు, మూడు జతల చెప్పులు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతితో పాటు బీబీపేట పీఏసీఎస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌గా గుర్తించారు. ముగ్గురు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు. సమాచారమందుకున్న ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన సాయికుమార్ గతంలో బీబీపేట ఎస్సైగా పని చేసి, బదిలీపై భిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పని చేసిన సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఇద్దరూ కలిసి ఒకేసారి అదృశ్యం కావడం, ఫోన్లు, చెప్పులు ఒకేచోట లభ్యం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు. వీరితో పాటు మరో వ్యక్తి కూడా ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

