ఖలీల్‌వాడి (మోపాల్ )/ కంఠేశ్వర్, జూలై 12: మోపాల్ మండలంలోని కంజర్ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ విజయలలితకు కలెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ, నిర్వహణ తీరుతెన్నులుగా నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఇందులో భాగంగా కంజర్ గురుకుల విద్యాలయం నిర్వహణ లోపాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జోనల్ అధికారిణి యుగంధర లక్ష్మితో ప్రాథమిక విచారణ జరిపించారు. నివేదికలో నిర్వహణ లోపాలు ఉన్నట్లు వెల్లడికావడంతో ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. విద్యా సంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం వైఖరిని ఉపేక్షించబోమని, అలసత్వం వహంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.