కోటగిరి : కాంప్లెక్స్ క్లస్టర్ రిసోర్స్‌పర్సన్‌గా 13 ఏళ్ల పాటు సేవలు అందించి ఇటీవల 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకంలో ఎస్జీటీగా ( SGT ) ఉద్యోగం సాధించిన సమగ్ర శిక్ష ఉద్యోగి సుధాకర్‌ను (Sudhakar) అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా బుధవారం కోటగిరిలో మండల విద్యాధికారి శ్రీనివాసరావు, పొతంగల్ మండల విద్యాధికారి లోల శంకర్ ఆధ్వర్యంలో సుధాకర్‌ను అభినందించి సన్మానించారు.
ఎంఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ సుధాకర్ 13 సంవత్సరాలుగా విధి నిర్వహణలో నిబద్దతతో పని చేస్తూ , తన నైపుణ్యంతో విద్యావనరుల కేంద్రానికి ఎంతగానో ఉపయోగపడ్డారని కొనియాడారు. ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసే స్వభావం ఉన్న సుధాకర్ భవిష్యత్‌లో మెరుగైన పని విధానాన్ని కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల విద్యావనరుల కేంద్రం సిబ్బంది , సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపేందర్ సుధాకర్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కో ఆర్డినేటర్ ఈర్వంత్, సీఆర్పీలు రమేష్, హనుమంతరావు, రాజేష్, మెసేంజర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.