నిజామాబాద్ : లయన్స్ సేవలను మరింత విస్తృత పరచాలని లయన్స్ జిల్లా గవర్నర్ నగేష్ (Lions Governor Nagesh ) పంపటి కోరారు. నిజామాబాద్ నగర శివారులోని కమ్మసంఘ భవనంలో ఆదివారం లయన్స్ క్లబ్ ( Lions Club) 62వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇతోదికంగా సేవలందిస్తున్న లయన్స్ సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు .
లయనిజంలోకి కొత్త వారిని తీసుకువచ్చి సేవా కార్యక్రమాల్లో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ చైర్మన్ డి.నర్సింహరాజు, లయన్స్ పూర్వ గవర్నర్లు ప్రకాష్ రావ్, లక్ష్మి, పెంటయ్య, బసవేశ్వర రావు, గందాని శ్రీనివాసరావు, ఓబుల్ రెడ్డి, వీటీ రాజ్ కుమార్, వీరేశం, జిల్లా కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి మధు, లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్ష ,కార్యదర్శులు అవన్ కుమార్, శంకర్, కోశాధికారి జయంత్, రీజియన్ చైర్మన్ అనిల్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.