ఖలీల్వాడి, డిసెంబర్ 19 : ఒక్క ప్రాణాన్ని కాపాడితే కోట్లు సంపాదించుకునట్లే అని స్పీకర్ పోచా రం శ్రీనివాస రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నగరంలోని ప్రగతినగర్లో శ్రీకృష్ణ న్యూరో మల్టీస్పెషాలిటీ దవాఖానను సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూరో సంబంధిత సమస్యలతో వచ్చిన వారంతా ఆర్యోంగా ఇండ్లకు వెళ్లాలని ఆకాక్షించారు. యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. ప్రమాదాల నివారణకు పోలీ సు శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. నరాలు చాలా సున్నితమైనవని ప్రతి విషయంలోనూ నరాలకు సంబంధించిన జబ్బులు వస్తాయని తెలిపారు.
ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయమైతే నరా ల మీద ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. కావున ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. చాలా ఏండ్లుగా బాలకృష్ణా రెడ్డి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఆపరేషన్ ఎం తో ముఖ్యమో, తర్వాత పోస్ట్ ఆపరేషన్ అంతే ము ఖ్యమని తెలిపారు. అన్ని వసతులతో ఈ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా ప్రజల ప్రాణాలను కాపాడడంలో ముందుండాలని తెలిపారు.ప్రస్తుత కాలంలో నూతన వైద్యా విధానం అందుబాటులోకి వస్తుందని దానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీని వినియోగించి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత డాక్టర్లకే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీటీసీ జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ తదితరులు పాల్గొన్నారు.