బాన్సువాడ, ఫిబ్రవరి 17: బాన్సువాడ పట్టణంలో మంగళవారం సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఓ కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో నుంచి రూ. 8లక్షలు ఎత్తుకెళ్లారు. బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామానికి చెందిన హాపీ యాదారావు వైద్యం కోసమని బాన్సువాడ ఎస్బీఐలో రూ. 8లక్షలు డ్రా చేశాడు. అక్కడి నుంచి తాడ్కోల్ రోడ్డులో ఉన్న రిలయన్స్ మార్టులో బిస్కెట్లు కొనడానికి కారు బయట పార్కింగ్ చేసి లోపలికి వెళ్లాడు.
తిరిగి వచ్చే సరికి గుర్తుతెలియని దుండగులు కారు వెనుక డోర్ అద్దాలను పగులగొట్టి సీటులో ఉన్న నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లినట్లు పట్టణ సీఐ తులా శ్రీధర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.